100 Jahre alt Calotropis Gigantea Wurzel HANUMAN Erukkam Pflanze
Weiß Shwetarka Tree - Mathaji Diskussion
Harihi om,
Weiß Shwetarka Baum Lord Hanuman ist bekannt, in jedem weißen Swetharka tree.When allgegenwärtig sein führen wir Pooja zu Lord Hanuman Idol, die mit der Wurzel dieses Baumes ist andby in seinem Baum Schatten zu halten. Wir empfangen Glück und Ruhm. Alle müssen nach ihren Wünschen anbeten.
Ich bin der Durchführung dieser Pooja die seit 30 Jahren hin und wieder. Jeder kann diese Pooja dienstag für 5,11,18,40 und 108 Wochen nach ihrem Wunsch führe. Im Schatten des Baumes die Hanuman halten und Alankaram tun und Hanuman Astothram singen. Jeder Fehler bei der Durchführung Pooja Verfahren wird akzeptiert, aber nicht in Bhakthi. Bhakthi bedeutet faith.I gesegnet ist von Herrn alle glücklich die Feierlichkeiten durchzuführen. Das Ergebnis ist Gottes Daya. So fühle ich, dass ich der glücklichste Mensch bin. Jeder wird Swamy Segen erhalten, wenn sie tun pooja mit voller Glauben und Vertrauen.


SINDHOORA LEPANA POOJA
Weiß Kronenblume Stammname in Telugu Tella Jilledu veru (తెల్ల జిల్లేడు వేరు)
Weiß Kronenblume Rootnamen in Tamil Erukkum Chedi veru
Die Erhaltung. Diese sindhooram soll werden muss
Leben, da sie direkt von Hanuman Körper entfernt.
Also, bitte bewahren diese in einem belüfteten Behälter und
nicht in einem luftdichten Behälter.
Sindoora Lepanam Pooja - Visistatha - Telugu
ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ „సింధూరం“ ....
పూర్వం శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు సీతమ్మ తలంటే స్నానం చేసి నుదుటన తిలకం దిద్ది, పాపిటన 'సింధూరం' పెట్టుకొ ని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో“మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడ ు, పొమ్ము హనుమా .... తరువాత రావచ్చును“అనెను. రాములవారు కూడా „సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా ... ఇప్పుడు రావద్దు ...“ అనెను. అంతట ఆంజనేయుడు „రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా ... మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులైపోతిరేమి రామా“అనగా, రాములవారు హనుమంతునితో„నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని“అని తెలిపాడు.హనుమంతుడు ఆశ్చర్యముతో„అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి“అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‚నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని“చెబుతుంది.వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా , శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి“హనుమా. ఇదేమిటి“అని అడగగా, హనుమంతుడు„మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికేడుకే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ. మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా“అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా„ఆంజనేయా. నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్నితిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి“అని వరదానం చేసాడు.ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ‚సింధూరం‘చూశారా. అందుకే హనుమకి సింధూరం పూయించి తరించండి.